News June 23, 2024

చిత్తూరు: ప్రేమజంటపై దాడి 

image

అమ్మాయి తరపు బంధువులు ప్రేమజంటపై దాడి చేసిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. హిందూపూర్‌కు చెందిన వాణి(21), బి.కొత్తకోట కరెంట్ కాలనీకి చెందిన కార్తికేయ(28) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో నెలక్రితం కదిరిలో వాణి, కార్తికేయ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు బి.కొత్తకోటకు వచ్చి దాడిచేసి గాయపరిచారు. మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 3, 2026

చిత్తూరు: పరీక్ష కేంద్రాలు ఇవే

image

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఓ మోహన్ కుమార్ శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.1. ఆర్‌వీఎస్ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, 2. పలమనేరు మదర్ తెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, 3. చిత్తూరు మురకంబట్టులోని శ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 4. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News January 3, 2026

మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల మద్యం తాగేశారు.!

image

చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31 తేదీలతో పాటు జనవరి ఒకటిన మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ మూడ్రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన.. 5738 కేసుల బీర్లు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 14,130 కేసులు అమ్ముడయ్యాయి.

News January 3, 2026

చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

image

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.