News July 12, 2024

చిత్తూరు: ఫైరింగ్ ప్రాక్టీస్ తనిఖీ

image

గన్‌మెన్లకు జీడీ నెల్లూరు సమీపంలోని చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైరింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ ఇస్తున్నారు. సంబంధిత ఫైరింగ్ ప్రాక్టీసును ఎస్పీ మణికంఠ శుక్రవారం తనిఖీ చేశారు. వీఐపీల వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు.. అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణకు సంసిద్ధులై ఉండాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు ప్రాక్టీస్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

Similar News

News November 23, 2025

చిత్తూరు: తండ్రి రిటైర్డ్ మిలిటరీ.. కొడుకు దొంగ

image

బెంగళూరు ATM చోరీ కేసులో <<18367776>>దోచుకున్న<<>> డబ్బులు దాచిపెట్టిన నవీన్ తండ్రి ఓ రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి. గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. ATM చోరీ కేసులో నవీన్ ఇంట్లో దాచిపెట్టిన రూ.5.60 కోట్లను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు.

News November 23, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 22, 2025

ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్‌తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.