News July 21, 2024
చిత్తూరు: బాలికపై అత్యాచారయత్నం
పులిచెర్ల(మం)లోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయం వద్ద ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి రెడ్డి హుసేన్ మామిడి తోటలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా బాలిక కేకలు వేసింది. కేకలు విన్న బాలిక తల్లి ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 12, 2024
చిత్తూరు: ప్రాణం తీసిన యువకుడి వేధింపులు
ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
News December 12, 2024
రెవెన్యూ సదస్సులు గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మలు: జేసీ
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రెవెన్యూ సదస్సులు పట్టుకొమ్మలు లాంటివని చెప్పారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 652 అర్జీలు వచ్చాయని చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
News December 11, 2024
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ధర్నా
రంగంపేట సమీపంలోని ఎంబీయూ వద్ద కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేయడంపై జర్నలిస్టు సంఘాలు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మీడియా సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.