News August 4, 2024
చిత్తూరు: బాలికపై బాలుడు అత్యాచారం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల వివరాల మేరకు.. కలికిరి మండలంలో బాలిక ఒకటో తరగతి చదువుతోంది. స్థానికంగా ఉంటున్న 14 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అతను బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News September 14, 2024
వరద బాధితులకు తిరుపతి అధికారుల సాయం
విజయవాడ వరద బాధితులకు తిరుపతి జిల్లా అధికారులు అండగా నిలిచారు. ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున తమ వంతు సాయం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి రూ.7.47 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు.
News September 13, 2024
ఆచూకీ తెలిస్తే తెలపండి: బంగారుపాళ్యం సీఐ
మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అందులో ఐడుగురి వివరాలను గుర్తించారు. పై ఫొటోలో ఉన్న ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే బంగారుపాళ్యం సీఐను 9440796736లో సంప్రదించాలి. చిత్తూరు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ నెంబర్ 9440900005కు కాల్ చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో కోరారు.
News September 13, 2024
వైసీపీ PAC మెంబర్‌గా పెద్దిరెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగాను అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి రోజా, తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి.