News August 12, 2024
చిత్తూరు బాలుడికి జైలుశిక్ష

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఓ బాలుడికి శిక్ష పడింది. చిత్తూరుకు చెందిన బాలుడిపై నేరం రుజువు కావడంతో తిరుపతి జువైనల్ జస్టిస్ కోర్టు సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించింది. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారమవుతామని.. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు సదాభిప్రాయం కలుగుతుందని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.
Similar News
News October 23, 2025
చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777
News October 22, 2025
బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
News October 22, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.