News October 1, 2024

చిత్తూరు: భవిత కేంద్రాల్లో ఖాళీలకు దరఖాస్తులు

image

భవిత కేంద్రాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బంగారుపాళ్యం, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సోమల కేంద్రాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫిజియోథెరపీ డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల ఐదులోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు.

Similar News

News October 1, 2024

చిత్తూరులో 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలియజేశారు. నగిరి, యాదమరి, పుంగనూరు మండలాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. బంగారుపాలెం, వీకోట, రామకుప్పం మండలాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి. సాయంత్రం లోపు లక్ష్యాలను చేరుకునేలా పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

News October 1, 2024

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

image

కురబలకోట మండలంలోని సర్కార్ తోపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సాయంతో వెలికి తీస్తున్నారు.

News October 1, 2024

తిరుపతి: చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, MLA

image

తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ లో స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.