News July 5, 2024
చిత్తూరు: భార్యపై కత్తితో దాడి

భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ వలసయ్య తెలిపారు. గంగనపల్లెకు చెందిన సెల్వరాసన్ అదే కాలనీకి చెందిన ఆరిఫాను 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. ఇంటి వద్ద గురువారం ఆరిఫాతో సెల్వ రాసన్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.
News July 7, 2025
చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
News July 7, 2025
తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.