News March 26, 2025
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. నిందితుడికి జైలు శిక్ష

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితునికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కట్టమంచికి చెందిన మహేశ్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో పని చేసేవాడు. 2023లో రూ.లక్ష దొంగతనం చేసి పరారయ్యాడు. అప్పట్లో సాంకేతిక ఆధారాలతో మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.
Similar News
News January 6, 2026
చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.
News January 6, 2026
చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.
News January 6, 2026
చిత్తూరుకు పునర్విభజన ఎఫెక్ట్.. తగ్గిన గ్రామ పంచాయతీలు

చిత్తూరు జిల్లాకు పునర్విభజన పుణ్యమా అంటూ గ్రామ పంచాయతీలు తగ్గాయి. 696 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా పునర్విభజన అనంతరం 75 గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య మదనపల్లి జిల్లాలో కలిసిపోయాయి. దీంతో 621 గ్రామ పంచాయతీలకు చిత్తూరు జిల్లా పరిమితమైంది. ఇక మండలాల వారీగా పుంగునూరు, చౌడేపల్లి, సదుం మండలాలు మదనపల్లిలో కలవడంతో 32 ఉన్న మండలాలు 28 కి మాత్రమే పరిమితమైంది. దీంతో చిత్తూరు చిన్నదైంది.


