News September 7, 2024
చిత్తూరు: మీరు చూపించిన సేవా భావం అందరికీ ఆదర్శం: SP
హెడ్ కానిస్టేబుల్ చూపించిన సేవాభావం అందరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వరద బాధితులకు రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఎస్పీకి అందజేయడంతో హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించారు.
Similar News
News October 13, 2024
తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో 24X7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 08772236007 నంబరుకు సమాచారం కొరకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్, సముద్ర బీచ్ ప్రాంతాలలో రేపటి నుంచి 17 వరకు సందర్శకులకు అనుమతి లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
News October 13, 2024
పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్‌ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
పలమనేరు : 17న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.