News April 10, 2025
చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.
Similar News
News April 13, 2026
చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.
News April 12, 2026
తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.
News April 12, 2026
చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


