News April 2, 2025
చిత్తూరు: ముగ్గురికి కాంస్య పతకాలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖోఖో పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు (ఫిజికల్ డైరెక్టర్లు) సురేష్ కుమార్, ముత్తు, దేవేంద్ర సత్తా చాటారు. ముగ్గురికీ కాంస్య పతకాలు దక్కాయి. ఈక్రమంలో వారిని కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. సహకారం అందించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బాలాజీని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు.
Similar News
News April 10, 2025
చిత్తూరు: ఖైదీలకు బ్యాంకు లోన్లు..!

చిత్తూరు జైలు ఖైదీలకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ తదితర కోర్సుల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ ట్రైనింగ్ ఇప్పించారు. ఫిబ్రవరి, మార్చిలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో ఓపెన్ క్లాస్ ద్వారా పదో తరగతి పాఠాలు చెబుతామన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు బ్యాంకు లోన్లు సైతం ఇప్పిస్తామని చెప్పారు. మహిళా ఖైదీలకు టైలరింగ్ నేర్పించాలని జైలు అధికారులు కలెక్టర్‌ను కోరారు.
News April 10, 2025
తిరుపతి: విషం పెట్టి చంపేశారా..?

చంద్రగిరి(M) నరసింగాపురంలో యువతి <<16044546>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ సంచలన విషయాలు చెప్పాడు. ‘మూడేళ్లుగా ప్రేమించుకుని గతేడాది గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆమె తల్లిదండ్రులు నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం రావడంతో అబార్షన్ చేయించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె నన్ను కలిసింది. దీంతో తన అమ్మానాన్న విషం పెట్టి చంపేస్తారని ఆమె నాకు మెసేజ్ చేసింది. ఆ పక్కరోజే ఆమె చనిపోయింది’ అని అజయ్ తెలిపాడు.
News April 10, 2025
చిత్తూరు-కాట్పాడి డబుల్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్

తిరుపతి-కాట్పాడి డబుల్ లైన్ నిర్మాణానికి రూ.1332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు వెల్లడించారు. తిరుపతి-పాకాల, చిత్తూరు-కాట్పాడి వరకు సింగిల్ లైనే ఉంది. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చనున్నారన్నారు. ఈ పనులు పూర్తి అయితే శ్రీకాళహస్తి-చెన్నై మార్గంలో బెల్లం, గ్రానైట్, మామిడి ఎగుమతులు పెరుగుతాయి.