News March 5, 2025
చిత్తూరు యువతకు గమనిక

యూత్ పార్లమెంట్ పోటీలకు ఈనెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని NYK కోఆర్డినేటర్ ప్రదీప్ కోరారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత మై భారత్ పోర్టల్‌లో నిమిషం నిడివి గల వికసిత్ భారత్ అంటే ఏమిటి అనే వీడియోను అప్లోడ్ చేసి రిజిస్టర్ కావాలని సూచించారు. 15న చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో స్క్రీనింగ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ప్రిన్సిపల్ జీవనజ్యోతి గోడపత్రిక ఆవిష్కరించారు.
Similar News
News March 23, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.151 ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ రూ. 172గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. లేయర్ కోడి మాంసం కిలో రూ.145కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మీ సమీప ప్రాంతాలలోని చికెన్ దుకాణాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 23, 2025
అన్న కోసం ఎదురు చూసి అనంతలోకాలకు

అన్న కోసం ఎదురు చూసిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. నగరి మండలం వీకేఆర్ పురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగనన్న కాలనీలో ఉంటున్న నోమేశ్వరి(10) మృతి చెందగా, ఆమె సోదరుడు మహేశ్ గాయపడిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడి కావడంతో అన్న కోసం ఎదురు చూసిన నోమేశ్వరి.. మహేశ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
News March 23, 2025
చిత్తూరు జిల్లాలో దూకుడు పెంచిన YCP

GDనెల్లూరుతోపాటూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా YCPనేతలు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల కోసం క్యాడర్‌ను ఇప్పటి నుంచే బలోపేతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ కీలక నేతలు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, వెంకటేగౌడ, రోజా తదితరులు ఎప్పటికప్పుడూ కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు CM చంద్రబాబు సైతం టీడీపీ నేతలకు ప్రజల్లో ఉండాలని ఆదేశించారు.