News February 27, 2026

చిత్తూరు: రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్..!

image

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పణకు మిగిలిందిక 2 రోజులే. ఈనెల 28 చివరి రోజు కావడంతో ఆన్లైన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్‌లో లైవ్ సర్టిఫికెట్ నమోదు చేయవచ్చు. చిత్తూరు జిల్లాలో పెన్షన్‌దారులు 12,500 ఉండగా గురువారం వరకు 11780 మంది లైవ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. మరో 720 మంది సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంది.

Similar News

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.