News December 19, 2024
చిత్తూరు: రూ.1750 చెల్లిస్తే.. రూ.35 వేలు పరిహారం

జిల్లాలో మామిడి పంటకు ప్రభుత్వం కల్పించిన బీమా పథకం గడువును ఈ నెల ఆఖరు వరకు పొడిగించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మామిడి రైతులు ఎకరాకు రూ.1750 చొప్పున ప్రీమియం చెల్లిస్తే ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారని తెలిపారు. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.
News November 20, 2025
చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.


