News February 9, 2025

చిత్తూరు: రెండు రోజుల క్రితం పెళ్లి.. ఇంతలోనే

image

రెండు రోజుల క్రితం పెళ్లి.. కొత్త దంపతులతో సహా పలువురు వధువు ఇంటికి విందుకు బయలుదేరారు. సరదాగా సాగుతున్న వారి ప్రయాణాన్ని లారీ రూపంలో వచ్చిన ప్రమాదం ఛిద్రం చేసింది. GDనెల్లూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాదమరి(M) దళితవాడకు చెందిన రామన్‌కు కవితతో శుక్రవారం పెళ్లి జరిగింది. శనివారం వారు ఆటోలో వధువు ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు.

Similar News

News March 18, 2025

రైల్వే మంత్రికి మిథున్ రెడ్డి వినతులు ఇవే..!

image

సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. తిరుపతి- హుబ్లీ ఇంటర్ సిటీ రైలు రెడ్డిపల్లిలో ఆగేలా చూడాలని కోరారు. తిరుపతి నుంచి కడపకు ఉదయం 5:10 గంటలకు బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఇకపై 6.10 గంటలకు బయలుదేరేలా చూడాలన్నారు. చెన్నై ఎగ్మోర్-ముంబై ట్రైన్‌కు కోడూరు, రాజంపేటలో, హరిప్రియ, సంపర్క్ క్రాంతికి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని విన్నవించారు.

News March 18, 2025

వారి పేర్లు తొలగించండి: సీపీఎం

image

చిత్తూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరులోని రాజకీయ పార్టీ నాయకులతో డీఆర్వో మోహన్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 20వేల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని తొలగించమని పదే పదే చెప్పినా.. తీసేయకపోవడం సరికాదన్నారు. ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉన్నారని చెప్పారు.

News March 18, 2025

చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

image

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

error: Content is protected !!