News June 2, 2024

చిత్తూరు: రేపటి నుంచి మద్యం విక్రయాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.

Similar News

News February 25, 2026

చిత్తూరు: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

image

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News February 25, 2026

చిత్తూరు: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన!

image

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్‌గా వెంకటేశ్‌ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News February 25, 2026

చిత్తూరు: పన్ను వసూళ్ల గడువు పెంపు

image

గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల డీపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో రూ.27.41 కోట్ల పన్ను వసూలు లక్ష్యంలో ఇప్పటివరకు రూ.18.63 కోట్లు(68 శాతం) వసూలైనట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.