News August 21, 2024
చిత్తూరు: రైతు ఉత్పత్తిదారుల సంస్థ బలోపేతం

జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రైతులు మెరుగైన, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి వారిని ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం మెరుగైన సాంకేతికత, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్న చిన్న కారు రైతులు ఎఫ్పీఓలో భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
Similar News
News November 2, 2025
పుత్తూరు: ‘ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట’

కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో ఆయన శనివారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద 9 మంది తొక్కిసాలాటలో మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య ప్రజలకు, భక్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.
News November 1, 2025
కుప్పం: మెడికో ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..?

కుప్పం మెడికల్ కళాశాలలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ (24) మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పీజీ అనస్తీషియా చేస్తున్న హర్షవర్ధన్ ఉదయం ఆసుపత్రిలో ఓ సర్జరీ కేసు చూసుకుని మధ్యాహ్నం లంచ్ సమయంలో హాస్టల్ గదిలోకి వెళ్లి హై డోస్ ఇంజక్షన్ వేసుకోవడంతో కార్డియాక్ అరెస్టై మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు నంద్యాల జిల్లా డోన్ కు చెందిన నాగరాజు కుమారుడు హర్షవర్ధన్గా సమాచారం.
News November 1, 2025
పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.


