News June 19, 2024
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

ఆటో బోల్తాపడి గాయపడ్డ విద్యార్థి మృతి చెందినట్లు ముదివేడి SI మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలంలో ఆటో బోల్తా పడిన విషయం తెలిసిందే. ముదివేడుకు చెందిన ఎస్.రఫీ కొడుకు ఎస్.జియావుల్లా(15)స్థానిక మోడల్ స్కూల్లో10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Similar News
News December 6, 2025
బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.
News December 6, 2025
బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.


