News September 11, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం Update

image

ములకలచెరువు: పెద్దపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి <<14074139>>మృతి<<>> చెందిన గుర్తు తెలియని యువకుడి ఆచూకీ లభించినట్లు ఎస్సై గాయత్రి తెలిపారు. మృతుడు సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, సుబ్బరాయునిపల్లికి చెందిన శ్రీరాముల నాయక్ కుమారుడు ప్రకాశ్ నాయక్(22) అని, తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రకాశ్ స్వగ్రామానికి బైకులో వస్తు పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద గోడను ఢీకొట్టి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News October 9, 2024

నేటి నుంచి రూ.49కే K.G టమాటా: చిత్తూరు జేసీ

image

చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.

News October 9, 2024

14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

News October 9, 2024

చిత్తూరు: 14 నుంచి పల్లె పండగ వారోత్సవాలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. పంచాయతీల వారీగా శంకుస్థాపనలు, ఎమ్మెల్యేల వారీగా రోజువారి అభివృద్ధి పనుల ప్రణాళిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ రోడ్లు, పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.