News September 12, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఐరాల మండలం ఆడపగుండ్లపల్లి వద్ద రెండు బైకులు ఢీ కొని ఒక్కరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. 45-కొత్తపల్లెకు చెందిన నరేంద్ర(25) బైక్‌పై వస్తుండగా… వెంగంపల్లెకు చెందిన అఖిల్, కురప్పపల్లెకు చెదిన యశ్వంత్‌లు చిత్తూరు నుంచి ఇంటికి వెళ్లుండగా అడపగుండ్లపల్లె వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చిత్తూరు మార్చురీకి తరలించారు.

Similar News

News October 3, 2024

తిరుపతి: సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ రిహార్సల్స్

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట నుంచి తిరుమల వరకు కాన్వాయ్ ట్రైల్ రన్ ను ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఇంటిలిజెన్స్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. విమానాశ్రయంలో వాహన శ్రేణి పోలీస్ అధికారులు, డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.

News October 3, 2024

రేపే తిరుపతిలో ఉద్యోగ మేళా

image

తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 3, 2024

కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా..?

image

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. కుప్పం నుంచి గ్రామీణ రహదారుల్లో వ్యాపారులు నిత్యం తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా గ్రానైట్ లారీలు సరిహద్దులు దాటుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుప్పం(M) పైపాళ్యం మీదుగా తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీని పై ఫొటోలో చూడవచ్చు.