News November 18, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి

image

ట్రాక్టర్ ఢీకొని కర్ణాటకకు చెందిన స్కూటరిస్టు దుర్మరణం చెందినట్లు పీటీఎం ఎస్ఐ నరసింహుడు తెలిపారు. పీటీఎం మండలం, మల్లెలగ్రామం చెన్నరాయునిపల్లి వద్ద గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం, చిలక నేర్పు గ్రామానికి చెంది రైతు రామాంజి(48) అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్ణాటకకు తరలించారు.

Similar News

News December 7, 2025

సదుంలో సినిమా షూటింగ్

image

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

image

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.