News May 5, 2024

చిత్తూరు: ర్యాండమైజేషన్ పూర్తి

image

పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్టు కలెక్టర్ శన్మోహన్ చెప్పారు. 2,318 బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ర్యాండమైజేషన్ పూర్తయిందన్నారు.

Similar News

News November 8, 2024

పలమనేరు: నూతన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి

image

నూతన బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు పలమనేరు నుంచి బెంగుళూరుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చొరవతో ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

News November 8, 2024

యాదమరి: కౌశల్ పోటి గోడపత్రిక ఆవిష్కరించిన కలెక్టర్

image

కౌశల్ క్విజ్ , పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల గోడ పత్రికను యాదమరి కె. గొల్లపల్లి పాఠశాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20,21,22 పాఠశాల స్థాయిలో, డిసెంబర్ 6న జిల్లా స్థాయిలో, 29,30 న రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం డిఇఓ వరలక్ష్మి చేతుల మీదుగా ఆమె చాంబర్లో ఆవిష్కరించారు.

News November 7, 2024

చిత్తూరు: ఆవుపై దాడి చేసిన చంపిన చిరుతపులి

image

ఆవుపై చిరుతపులి దాడి చేసిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చౌడేపల్లి మండలం చుక్కావారిపల్లె గ్రామం వద్ద చిరుత పులి ఆవుపై దాడి చేసి చంపిన చంపేసింది. స్థానికులు కేకలు వేయడంతో ఆవు కళేబరాన్ని తింటున్న చిరుత పులి అక్కడ నుంచి పారిపోయింది. కొద్దిరోజుల క్రితం చిరుత పులి సంచారం కలకలం రేపిన విషయం విదితమే. అధికారులు చిరుతపులి దాడుల నుంచి తమకు భద్రత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.