News November 19, 2024

చిత్తూరు: వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు

image

సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మంగళగిరి వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పాలేటి రాజకుమార్ పై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కలిసి టీడీపీ నాయకులు జాఫర్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Similar News

News December 11, 2024

తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు

image

తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

News December 11, 2024

చిత్తూరు: ‘టిడ్కో గృహాలను మంజూరు చేయండి’

image

టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ గృహాలను 2019-24 వరకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

News December 10, 2024

ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

image

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16న ప్రారంభం కానుంది. ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు.