News September 11, 2024

చిత్తూరు: వరద బాధితులకు హీరో రూ.10 లక్షల విరాళం

image

బంగారుపాళ్యం మండలం మాధవ నగర్ (మాదిగోని తోపు)కు చెందిన జెట్టి సినిమా హీరో మురళి విజయవాడ వరద బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి తనవంతు సహాయంగా రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. మురళి మాట్లడుతూ.. బుధవారం విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి వారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 10 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు.

Similar News

News October 9, 2024

నేటి నుంచి రూ.49కే K.G టమాటా: చిత్తూరు జేసీ

image

చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.

News October 9, 2024

14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

News October 9, 2024

చిత్తూరు: 14 నుంచి పల్లె పండగ వారోత్సవాలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. పంచాయతీల వారీగా శంకుస్థాపనలు, ఎమ్మెల్యేల వారీగా రోజువారి అభివృద్ధి పనుల ప్రణాళిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ రోడ్లు, పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.