News December 19, 2024

చిత్తూరు: వాయిదా పడిన పరీక్షల తేదీలు ఇవే

image

వర్షం కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించడానికి తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివరాలు ఇవే..
➤ ప్రైమరీ స్కూల్స్(1-5) 
21న ఇంగ్లీష్, 
23న గణితం
➤ హైస్కూల్లో (6-10) 
20న గణితం
21న హిందీ
23న ఇంగ్లీష్ 

Similar News

News December 4, 2025

చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.

News December 4, 2025

చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

image

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్‌ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్‌ను వీఆర్‌కు పంపారు. చిత్తూరులో వీఆర్‌లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.

News December 4, 2025

రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

image

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.