News September 9, 2024
చిత్తూరు: విద్యార్థి దారుణ హత్య..?
ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 10, 2024
చిత్తూరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్
వెల్లూరు సీఎంసీ సంస్థ అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరులో రూ.500 కోట్లతో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఆవిష్కరించారు. ఇప్పటికే ఉన్న 120 పడకల ఆసుపత్రిని 422 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని సౌకర్యాలు, సిబ్బంది నియామకం జరుగనుంది.
News October 10, 2024
14న చిత్తూరు RR గార్డెన్‌లో లాటరీ సిస్టం
నూతన మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈనెల 14న నిర్వహిస్తామని అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి వెల్లడించారు. ఈనెల 11న షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో జరగాల్సిన టెండర్ ప్రక్రియను మార్పు చేసినట్లు చెప్పారు. టెండర్‌దారులు 14వ తేదీ సంతపేట RR గార్డెన్లో ఉదయం 8 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
News October 9, 2024
మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.