News October 6, 2024
చిత్తూరు: వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి
చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.
Similar News
News November 3, 2024
ఏర్పేడు: వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్ట్ ఆఫీసర్-02, అసిస్టెంట్ మేనేజర్-01 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బీటెక్, ఎంటెక్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 07.
News November 3, 2024
తొట్టంబేడుకు చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి
ఆవును తప్పించబోయి యువకుడు మరణించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తొట్టంబేడు మండలంలోని రాంబట్లపల్లె గ్రామానికి చెందిన సి.హెచ్. మోహన్ రెడ్డి (41) తిరుపతిలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తిరుపతిలోనే నివాసం ఏర్పరచుకున్నారు జీవనం సాగించేవాడు. ఆవును తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు.
News November 3, 2024
రోడ్డు ప్రమాదంలో వరదయ్యపాళెం యువకుడు మృతి
వరదయ్యపాళెం మండలంలోని గోవర్ధనపురం గ్రామానికి చెందిన సుదేవ్ (22) అతని స్నేహితులు మూడు రోజుల క్రితం నాయుడుపేటకి వెళ్లారు. తిరిగి వస్తుండగా నాయుడుపేట బైపాస్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సుదేవ్‌కి తీవ్ర గాయాలతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఘటనపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.