News March 8, 2025

చిత్తూరు: వైసీపీ మహిళా విభాగంలో జిల్లా వాసుల నియామకం

image

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర మహిళా అనుబంధ విభాగంలో చోటు లభించింది. రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గీతా యాదవ్, జనరల్ సెక్రటరీలుగా గాయత్రీ దేవి, దాక్షాయిణి, స్పోక్స్ పర్సన్‌గా శ్రీదేవి రెడ్డి, కార్యదర్శులుగా మేరీ జయరాం, సరస్వతమ్మ, కల్పలత రెడ్డి, యమునమ్మ, ధనలక్ష్మిని నియమిస్తూ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News March 16, 2026

ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

image

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

News March 16, 2026

సెలవులో చిత్తూరు కలెక్టర్

image

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

News March 16, 2026

చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

image

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.