News August 10, 2024
చిత్తూరు: వ్యక్తి ప్రాణం తీసిన జల్లికట్టు

జల్లుకట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన యాదమరిలో చోటుచేసుకుంది. కొట్టాలలో మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో జల్లికట్టు నిర్వహించారు. దీనికి తమిళనాడు సరిహద్దు పరిసర ప్రాంతాల, మండలంలోని ఎద్దులు అధిక సంఖ్యలో వచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగారుపాళెంకు చెందిన దిలీప్కుమార్(40)పైకి దూసుకెళ్లింది. ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.
Similar News
News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. పలువురు సమస్యలను ఆయన నేరుగా తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో డీఆర్వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


