News May 11, 2024
చిత్తూరు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Similar News
News December 1, 2025
6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
News November 30, 2025
చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.


