News May 11, 2024
చిత్తూరు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Similar News
News March 7, 2026
లింగ నిర్ధారణ చట్టం పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పక్కగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్లోని కోర్టు హాల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ప్రసూతి మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ, అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
News March 7, 2026
చిత్తూరు: కార్పొరేట్ ఉచిత విద్యకు 10 వరకే గడువు

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద, మధ్యతరగతి వర్గాల వారు ఉచితంగా కార్పొరేట్ విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇందుకోసం విద్యాసంస్థలు 25% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రవేశానికి తగిన సర్టిఫికేట్లతో సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు మార్చి 10 వరకు మాత్రమే ఉంది. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.
News March 7, 2026
9న చిత్తూరు DRC సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌లో ఈనెల 9న ఉదయం 11 గంటలకు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం(డీఆర్సీ) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ(పీజీఆర్ఎస్, రీసర్వే), వ్యవసాయ, ఉద్యానశాఖ, విద్య, వైద్యఆరోగ్య శాఖ అంశాలపై చర్చించనున్నారు.


