News October 24, 2024

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా సచివాలయంలో సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 8,996 ఫిర్యాదులు అందగా 6,399 సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించినట్లు చెప్పారు. సమస్యల రీఓపెన్ కు అవకాశం లేకుండా అధికారులు చూడాలని అన్నారు.

Similar News

News December 27, 2024

కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.

News December 25, 2024

అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

image

తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.

News December 25, 2024

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.