News September 17, 2024
చిత్తూరు: సీటుకోసం బ్యాగు వేస్తే బంగారు నెక్లెస్ పాయె..!
సీటుకోసం బస్సు కిటికీ లోంచి బ్యాగు వేస్తే రూ.4 లక్షల నెక్లెస్ కొట్టేసిన ఘటన చిత్తూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం.. బెంగళూరుకు చెందిన లక్ష్మి చిత్తూరు బస్టాండ్‌కు వచ్చింది. బెంగళూరు వెళ్లే బస్సు రావడంతో సీటు కోసం కిటికిలో నుంచి ఓ సీటులోకి తన హ్యాండ్ బ్యాగు వేసింది. ఆ సీటులో వేరేవాళ్లు కూర్చొని ఉండడంతో దిగేసింది. కాసేపటికి బ్యాగు తెరచి చూసేసరికి 64 గ్రాముల బంగారం నెక్లెస్ కనిపించలేదు.
Similar News
News December 22, 2024
మదనపల్లె: డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీ
SVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో యథ్చేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మదనపల్లెలో కొన్ని కాలేజీలలో యాజమాన్యాలు సీపీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ పరీక్షలు రాయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై SVU పరీక్షల నియంత్రణ అధికారి కిశోర్‌ను వివరణ కోరగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
News December 22, 2024
చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?
పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్‌రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
News December 22, 2024
చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.