News May 4, 2024

చిత్తూరు: సెల్ ఫోన్స్ అనుమతిలేదు

image

పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పీవికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5,6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రానికి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదన్నారు.

Similar News

News November 4, 2024

రేపు చిత్తూరులో జాబ్ మేళా 

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన యువతి యువకులు అర్హులన్నారు. 

News November 3, 2024

తిరుమలలో భారీ రద్దీ.. భక్తుల అవస్థలు

image

తిరుమల శ్రీవారి దర్శనానికి నేడు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతోపాటు దీపావళి సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున కొండ మీదకి తరలి వెళ్లారు. దీంతో ప్రధాన కంపార్ట్‌మెంట్లన్నీ నిండి భారీగా క్యూ లైన్ ఏర్పడింది. సుమారు ఆరు గంటల నుంచి ఆహారంతోపాటు నీటి సదుపాయం కూడా లేదని పలువురు చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ సిబ్బంది స్పందించాలని వారు కోరారు.

News November 3, 2024

తిరుచానూరులో తీవ్ర విషాదం

image

తిరుపతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. తిరుచానూరు పరిధిలోని శిల్పారామంలో క్రాస్ వీల్‌(జాయింట్ వీల్ లాంటింది)లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా అందులోని ఓ బాక్స్ ఊడిపోయింది. దీంతో ఓ మహిళ మృతిచెందింది. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.