News March 29, 2024
చిత్తూరు: 1 నుంచి టెన్త్ మూల్యాంకనం
చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పదో తరగతి మూల్యాంకనం జరుగుతుందని డీఈవో దేవరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్‌ను నియమించామని చెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పీసీఆర్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Similar News
News January 20, 2025
తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్‌పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
News January 20, 2025
చిత్తూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
కలిచర్లలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. పెద్దమండెం మండలం, ఖాదర్ షరీఫ్ కుమారుడు ఉస్మాన్(21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉస్మాన్ ఊరికి సమీపంలోనే ప్రభుత్వ కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్లపొదల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 20, 2025
చిత్తూరు జిల్లాలో తెరుచుకున్న స్కూళ్లు
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. వారం నుంచి ఇంటి వద్ద సంతోషంగా గడిపిన చిన్నారులు స్కూళ్లకు బయలుదేరారు. స్నేహితులతో ఆటలు, అమ్మచేతి కమ్మని వంట, బంధువుల ఆప్యాయత మధ్య గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ స్కూళ్లకు వెళ్లారు. పలువురు ‘అమ్మా.. ఇవాళ నాకు కడుపు నొప్పి.. నేను బడికి వెళ్లను అంటూ మారం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. మీరు ఇలానే చేశారా?