News April 4, 2025

చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

Similar News

News April 8, 2025

మే 31లోపు ప్రణాళికలు సిద్ధం చేయండి: చిత్తూరు కలెక్టర్ 

image

మే 31లోపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని  కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమైయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై సచివాలయ మండల నియోజకవర్గ స్థాయి అధికారులు డాక్యుమెంట్ తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు.

News April 8, 2025

వెదురుకుప్పం: స్వగ్రామానికి మిస్ గ్లోబల్ ఏషియన్ విజేత

image

వెదురుకుప్పం మండలం పాతగుంట టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గోపికృష్ణరెడ్డి కుమార్తె భావన మిస్ గ్లోబల్ ఏషియన్-2025గా నిలిచింది. ఈక్రమంలో ఆమె పాతగుంటకు మంగళవారం చేరుకున్నారు. గ్రామస్థులు ఆమెకు ఆహ్వానం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రబాబు రెడ్డి, లోకనాథ రెడ్డి, తిమ్మరాజులు, హేమ శేఖర్, ఎమ్మెస్ రెడ్డి పాల్గొన్నారు.

News April 8, 2025

చిత్తూరులో భార్యపై యాసిడ్‌తో దాడి

image

చిత్తూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన దావూద్, రేష్మ భార్యభర్తలు. మనస్పర్థలతో ఇటీవలే విడిపోయారు. ఈక్రమంలో నిన్న రాత్రి దావూద్ రేష్మ ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో దావూద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రేష్మ ముఖంపై చల్లాడు. ఆమె గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. గాయపడిన రేష్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!