News September 1, 2024
చిత్తూరు: 30 మండలాల్లో వర్షం
అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని 30 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. విజయపురం మండలంలో 21.8 మి.మీటర్లు, చిత్తూరు 18. 2, పూతలపట్టు 16.6, సదుం 16.4, పులిచెర్ల 15, సోమల 14.8, నగరి 14.2, నిండ్ర, ఎస్ ఆర్ పురం 13.6, తవణంపల్లె 12.2, గంగాధర నెల్లూరు 12, కుప్పం 10.6 మి.మీటర్లు కురవగా.. మిగిలిన మండలాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షపాతం నమోదైంది.
Similar News
News September 13, 2024
ఆచూకీ తెలిస్తే తెలపండి: బంగారుపాళ్యం సీఐ
మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అందులో ఐడుగురి వివరాలను గుర్తించారు. పై ఫొటోలో ఉన్న ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే బంగారుపాళ్యం సీఐను 9440796736లో సంప్రదించాలి. చిత్తూరు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ నెంబర్ 9440900005కు కాల్ చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో కోరారు.
News September 13, 2024
వైసీపీ PAC మెంబర్‌గా పెద్దిరెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగాను అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి రోజా, తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
News September 13, 2024
చిత్తూరు: ప్రమాదంలో మృతి చెందింది వీరే..!
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదుగురి వివరాలు గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. బల్లరాజు(సిద్దిపేట, తెలంగాణ), ఎ.విజయ(పాకాల మండలం కంబాలమెట్ట), మనోహర్(ఆర్టీసీ డ్రైవర్) ,బేబీ హన్సిక(యూపీ), సోను కుమార్(ఉత్తరప్రదేశ్) చనిపోయినట్లు గుర్తించారు.