News May 12, 2024

చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

Similar News

News January 7, 2026

దొంగలపై 181 కేసులు.. చిత్తూరులో చిక్కారు.!

image

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన <<18789584>>దొంగల<<>> వివరాలు.. గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య (49), పల్నాడు జిల్లా నారాయణపురానికి చెందిన నాగుల్ మీరా(27), గుంటూరు జిల్లా సంగడి గుంటకు చెందిన తులసి రామిరెడ్డి (27)ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకయ్యపై 100 కేసులు, నాగుల్ మీరాపై 75 కేసులు, తులసి రామిరెడ్డి పై ఆరు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

News January 7, 2026

9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

image

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 6, 2026

చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

image

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.