News September 19, 2024
చిత్తూరు: 66 మంది డీటీలు ట్రాన్స్ ఫర్
చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.
Similar News
News October 13, 2024
తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు
గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
News October 13, 2024
SVU : డిగ్రీ ఫలితాలు విడుదల
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News October 13, 2024
బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూ లైన్
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అన్ని కంపార్ట్మెంట్ లు నిండిపోయి ప్రస్తుతం బాట గంగమ్మ ఆలయం వద్ద క్యూలైన్ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. శనివారం ఒక్కరోజు 73,684 మంది దర్శనం చేసుకున్నారు. 36,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.2.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.