News April 15, 2025
చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.
Similar News
News April 20, 2025
పలమనేరు PGRSకు రానున్న కలెక్టర్

పలమనేరులో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొంటారని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. పలమనేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉదయం 9:30 గం. ప్రారంభవుతుందని, స్వయంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News April 18, 2025
చిత్తూరులో రేపు మెగా జాబ్ మేళా

చిత్తూరు గ్రీన్ పేటలోని డిగ్రీ కళాశాలలో 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నారు.
News April 18, 2025
చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.