News March 7, 2025
చినతాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు నుంచి ఎల్.అగ్రహారం మోటార్ సైకిల్‌పై వస్తున్న తిరుపతి వెంకటరమణ (66) ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుని భార్య తిరుపతి వెంకట సూర్య కుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై దుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.