News March 29, 2025
చిన్నకోడూరు: హోంగార్డుల సమస్యలు తెలుసుకున్న అడిషనల్ డీసీపీ

జిల్లాలో ఉన్న హోంగార్డు సిబ్బందితో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అడిగి తెలుసుకున్నారు. హోంగార్డుల సంక్షేమానికి ఎల్లావేళలా కృషి చేస్తామని, యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరం ఒక కుటుంబ సభ్యులమే అని అన్నారు.
Similar News
News November 18, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.
News November 18, 2025
SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
News November 18, 2025
పుట్టపర్తికి సచిన్ టెండూల్కర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టపర్తికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్‌ను మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.


