News October 7, 2024
చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం

ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్‌స్పెక్టర్స్‌ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలివే.!

ప్రకాశం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు సగటు వర్షపాతం 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. మంగళవారం రాత్రి ఒంగోలుతోపాటు పలు మండలాలలో మోస్తరు వర్షపు జాడ కనిపించింది. దిత్వా తుఫాను ప్రభావం జిల్లాపై అంతంత మాత్రమేనని చెప్పవచ్చు.
News December 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.


