News October 7, 2024

చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం

image

ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 6, 2024

అభ్యంతరం ఉంటే చెప్పండి: ప్రకాశం డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని కేజీబీవీల్లో పోస్టులకు ప్రకటించిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు పొడిగించినట్లు డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. మొత్తం 51 టీచింగ్, నాన్ టీచింగ్  పోస్టులకు సబ్జెక్టుల వారీగా 1.10 చొప్పున మెరిట్ జాబితా తయారు చేసి జేసీకి సమర్పించారు. వివరాలు నోటీసు బోర్డులో ఉంచారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలపాలని డీఈవో కోరారు.

News November 6, 2024

రేపు ప్రకాశం జిల్లాకు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ రాక

image

ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లా పర్యటన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసే అవకాశం ఉందని చెప్పారు. 

News November 6, 2024

వేటపాలెం: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. వేటపాలెం మండలం పార్వతీపురంలో మతిస్థిమితం లేని అవివాహిత(34) ఉంటోంది. ఆమె తండ్రి చనిపోగా.. తల్లి పాచి పనులు చేసి పోషిస్తోంది. ఈక్రమంలో ఆమె పనులకు వెళ్లగా.. అదే ఏరియాలో ఆకుకూరలు అమ్మే సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడ్డాడు. మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేశాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.