News August 28, 2024
చిన్నగంజాం మండలంలో సినీ తారల సందడి
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారల సందడి నెలకొంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై గోపీచంద్ డైరెక్షన్‌లో హిందీ సినిమా షూటింగ్ మోటుపల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. కాగా సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్నగంజాం ఎస్సై రమేశ్ షూటింగ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News September 20, 2024
ఒంగోలు: కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మహిళలకు కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19-45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.
News September 20, 2024
మానవత్వం చాటుకున్న ప్రకాశం SP
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేఫథ్యంలో జిల్లా SP దామోదర్ బందోబస్తు నిమిత్తం వెళుతున్న క్రమంలో.. ఒంగోలులోని ఉడ్ కంప్లెక్ వద్ద నెల్లూరు జిల్లా జలదంకు చెందిన బ్రహ్మయ్య మూర్ఛ వచ్చి పడిపోయాడు. విషయం గమనించిన ఎస్పీ తనవాహనం ఆపి అతని చేతిలో తాళాలు పెట్టి, సృహ తెప్పించి అనంతరం మంచి నీళ్లు తాగించి అక్కడినుంచి వెళ్లారు. మంచి మనస్సు చాటుకున్న SPని పలువురు అభినందించారు.
News September 20, 2024
నేడు జగన్‌ను కలవనున్న MLA తాటిపర్తి
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.