News August 14, 2024

చిన్నశంకరంపేట: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చిన్నశంకరంపేటకు చెందిన వికాస్ కుమార్(23) డిగ్రీ పూర్తి చేసుకొని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు మెదక్, చేగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్ళారు. వైద్యుల సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వికాస్ కుమార్ మృతి చెందాడు.

Similar News

News September 10, 2024

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం: హరీష్ రావు

image

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానానికి చెంపు పెట్టుతున్నదని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హతకు గురికావడం తద్యమన్నారు. ఈ క్రమంలో ఆయా సంబంధిత నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు.

News September 10, 2024

బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవు: ఎంపీ రఘునందన్

image

ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే పార్టీ బిజెపిలో మాత్రమే సాధ్యమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బిజెపి కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.

News September 9, 2024

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు

image

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.