News October 31, 2024

చిన్నారికి నామకరణం చేసిన సోమిరెడ్డి

image

నెల్లూరు నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన ఓ మహిళకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని ఆటోలో ఎదురెళ్లారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసం వద్ద ఆటోలో నుంచి అంబులెన్స్‌లోకి ఎక్కించి అక్కడే ప్రసవం చేశారు. సోమిరెడ్డితో పాటు ఆయన కోడలు శృతిరెడ్డి చిన్నారిని ఎత్తుకున్నారు. దీపావళి నాడు పుట్టిన చిన్నారికి ‘సంతోషి’గా నామకరణం చేశారు.

Similar News

News November 1, 2024

ఉదయగిరికి ఫస్ట్.. నెల్లూరు లాస్ట్ 

image

అపార్ నమోదులో జిల్లాలో ఉదయగిరి తొలి స్థానంలో నిలిచిందని MEO- 2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అపార్ నమోదులో జిల్లాలోని 38 మండలాలకు గాను ఉదయగిరి 58.76శాతంతో మొదటి స్థానం దక్కిందన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్ చివరి స్థానాల్లో కొనసాగడం గమనార్హం. ఉదయగిరిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన HM కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News November 1, 2024

గూడూరు: తండ్రిని చంపిన కుమారుడు

image

గూడూరు నియోజకవర్గంలో శుక్రవారం మరో హత్య జరిగింది. వాకాడు మండలం శ్రీనివాసపురంలో తండ్రి చిన్న సుబ్బరామయ్యను కుమారుడే హత్య చేశాడు. తండ్రి అన్నం తింటున్న సమయంలో కర్రతో కొట్టడంతో తీవ్రగాయమైంది. ఘటనా స్థలంలోనే సుబ్బరామయ్య మృతిచెందాడు. కుమారుడు పరారీలో ఉన్నాడు. వాకాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదే నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో <<14501641>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే.

News November 1, 2024

తడ: గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

image

తడ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్స్‌ను తడ పోలీసులు ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ వద్ద బ్యాగ్స్‌తో ఉన్న నలుగురు అనుమానస్పదంగా ఉన్నారనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు ఉన్నారు.