News February 4, 2025
చిన్నారికి శ్రీశైలం ఎమ్మెల్యే సాయం

సున్నిపెంటకు చెందిన ఓ చిన్నారి వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిక్షా కాలనీకి చెందిన శివ 5ఏళ్ల కుమార్తెపై ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయమై ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైల మండల టీడీపీ ఇన్ఛార్జి వై.యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటారు.
Similar News
News October 16, 2025
WGL: హెల్మెట్ ధరించడం నియమం కాదు.. జీవన రక్షణ!

హెల్మెట్ ధరించడం కేవలం రూల్స్ పాటించడం కాదు, జీవాన్ని విలువైనదిగా భావించే బాధ్యతగా చూడాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రైడ్లో జాగ్రత్తగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి బైక్ రైడ్కు ముందు హెల్మెట్ ధరించడం మన జీవితాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగని వారు సూచించారు.
News October 16, 2025
MHBD: పత్తి రైతుకు తిప్పలు తప్పవా..!

పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడంతో పత్తి రైతుకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేని, చదువు రాని రైతులకు ఈయాప్ వాడటం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యాప్పై అవగాహన సదస్సులను నిర్వహించాలని,అకాల వర్షాలకు భారీగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని, పండిన కొద్దిపాటి పత్తిని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందిగా మారింది.
News October 16, 2025
మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.