News February 4, 2025

చిన్నారికి శ్రీశైలం ఎమ్మెల్యే సాయం

image

సున్నిపెంటకు చెందిన ఓ చిన్నారి వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిక్షా కాలనీకి చెందిన శివ 5ఏళ్ల కుమార్తెపై ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయమై ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైల మండల టీడీపీ ఇన్‌ఛార్జి వై.యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటారు.

Similar News

News March 11, 2026

ఫిరాయింపు MLA కేసులో క్లీన్ చిట్.. KTR ఫైర్

image

TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ <<19352106>>క్లీన్ చిట్<<>> ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘కాంగ్రెస్ బీఫామ్‌పై MPగా పోటీ చేసిన వారికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని KTR హెచ్చరించారు.

News March 11, 2026

వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు.

News March 11, 2026

మెదక్: LOVER❤️ బెదిరింపుతో సూసైడ్

image

అల్లాదుర్గం(M)అప్పాజీపల్లికి చెందిన రూప(21) ప్రియుడి బెదిరింపులతో ఆత్మహత్య చేసుకుంది. HYDలో పనిచేస్తున్న రూపకు మరో యువకుడితో వారం క్రితం నిశ్చితార్థం జరగడంతో, ప్రియుడు ఆమెకు ఫోన్‌ చేసి తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై రూప సోమవారం చెరువులో దూకగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.