News February 11, 2025

చిన్నారి మృతి దురదృష్టకరం: మంత్రి

image

తాడేపల్లి అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులిపురుగుల మాత్రను వేయడంతో, గొంతులో అడ్డం పడి చిన్నారి మృతి చెందడం బాధాకరమని గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి కత్తుల రస్మిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నారి మృతిపై దర్యాప్తు చేసి అంగన్వాడీ టీచర్, ఆయా, సూపర్వైజర్లను సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News February 27, 2026

స్వాతంత్ర్యం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు: ప్రధాని మోదీ

image

ఒకప్పుడు ఫారిన్ టెక్నిక్స్ కాపీ కొట్టే దుస్థితిలో భారత్ ఉండేదని ప్రధాని మోదీ రైజింగ్ భారత్ సమ్మిట్‌లో తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినా చాలా కాలం దేశంలో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. ఇప్పుడు తన శక్తి ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడి అగ్రరాజ్యాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ జరుపుకోవడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.

News February 27, 2026

రివార్డ్ పాలసీ రూ.కోటి ఇవ్వండి: దేవ్ జీ

image

TG ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ దేవ్ జీ అన్నారు. ఇవాళ CMతో భేటీ తర్వాత మాట్లాడారు. ‘రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరాం. ఐదెకరాల భూమి ఇవ్వడం సాధ్యం కాదని CM అన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవన భృతిపై హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైళ్లలో మావోయిస్టులను కలుస్తాం. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం. తుపాకీ సిద్ధాంతం నడవదని వివరిస్తాం’ అని దేవ్ జీ తెలిపారు.

News February 27, 2026

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం

image

హైదరాబాద్‌కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.